
వరదల్లో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం చెవికి ఉన్న బంగారు కమ్మలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరదల్లో చనిపోయిన మహిళ ఒంటి మీద ఉన్న చెవి కమ్మలు తీసేస్తున్న వీడియో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.నారాయణి నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని కొందరు వ్యక్తులు చెక్కల సాయంతో ఒడ్డుకు లాగారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమె చెవులకు ఉన్న పోగులను తీసి పక్కన పెట్టారు. చుట్టూ ఉన్నవారు ఈ దృశ్యాలను వీడియో తీయడంతో విషయం బయటపడింది.వీడియో ఆధారంగా..25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిగా స్థానిక పోలీసులు గుర్తించారు. భరత్‌పూర్ లోని పోఖరా బస్ పార్క్ దగ్గర వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.











