
జపాన్: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్ కూడా ఉండటంతో టి-20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాయి.ఈ ఈ రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ సీడ్ జట్లుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
మిగిలిన నాలుగు క్వార్టర్ ఫైనల్స్ బెర్తుల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. గ్రూప్-ఎ అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్, గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేసియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టాప్-8కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 1న సెమీ ఫైనల్స్, 3న కాంస్య పతాక మ్యాచ్.. అదే రోజు గోల్డ్ మెడల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఎనిమిది జట్లకు డైరెక్ట్ నాకౌట్ విధానంలో సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌తో భారత్, బంగ్లాదేశ్‌తో చైనా, శ్రీలంకతో మలేసియా, పాకిస్థాన్‌తో థాయ్‌లాండ్ తలపడనున్నాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడం ఇది నాలుగోసారి. అంతకుముందు 2010, 2014, 2023లో నిర్వహించారు.











