
లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నిషేధం విధించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆన్‌లైన్ వేదికగా పోరాటం చేస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్‌లో నిర్వాహకులు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలతో జట్టుపై నిషేదం విధించాలనే డిమాండ్‌తో ఆన్‌లైన్ లీగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం 2.50 కోట్ల మంది అభిమానుల సంతకాలతో కూడిన పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతు పలికి సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఈ సంఖ్యను ఐదు కోట్లకు పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేశారు. మరోవైపు ఇటీవల ముగిసిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.











