
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తులతో ఆయనకు బెయిల్ ఇచ్చింది. మే 26న తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బాల్కా సుమన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నాంపల్లిలోని సింగరేణి భవన్‌తో పాటు మందమర్రిలోని జిఎం కార్యాలయాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సింగరేణి భవన్ అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను తెలంగాణ భవన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాల్క సుమన్‌కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.












