
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భోగాపురం ఎయిర్ పోర్టుని వేదికగా వాడుకున్నారని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శనివారం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం లో దేశ ప్రధాని ముందు కూడా అబద్ధాలు ఆడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చింది జగన్ హయాంలోనేనని, 2026లో ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తామని ఆనాడే జగన్ చెప్పారని అమర్నాథ్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందని విమర్శించారు. చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు తమకు లేవని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేసింది కొబ్బరికాయ కొట్టడం.. గుమ్మడికాయ కట్టడం మాత్రమేనని, దారినే పోయే వాళ్లు ఎవరైనా కొబ్బరికాయ కొడతారని, గుమ్మడికాయ కడతారని ఎద్దేవా చేశారు. మిగతా పనంతా చేసింది జగనేనని అమర్నాథ్ పేర్కొన్నారు.








