
కాంగ్రెస్, వామపక్షాల పన్నాగాలు
‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికల వెనుక దేశ వ్యతిరేక శక్తుల హస్తం
‘నీట్’పై తక్షణమే స్పందించి 31 మందిని అరెస్ట్ చేశాం
యుపిఏ పాలనలోనే రికార్డు స్థాయి లీకేజీలు n బిజెపి చీఫ్ రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అశాంతిని సృష్టించి, యువతను రెచ్చగొట్టడం ద్వా రా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బిజె పి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదే శ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పుణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల వెనుక ఈ దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక్తుల నుంచి రూ. 10 కోట్లు, కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు అందుతోందని ఆధారాలతో సహా సంచలన విషయాలు వెల్లడించారు.
ఏ ఖలిస్తానీ శక్తులైతే రాహుల్ గాంధీ నానమ్మను పొట్టనబెట్టుకున్నారో, అదే శక్తులతో రాహుల్ గాంధీ జతకట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు, విదేశీ నిధులతో నడిచే సంఘాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో జరిగిన పరిణామాలను ఇక్కడ పునరావృతం చేయాలని చూస్తే భారతీయ యువత చూస్తూ ఊరుకోదని, వారంతా దేశభక్తితో ప్రధాని మోడీ నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతారని రాంచందర్ రావు స్పష్టం చేశారు.‘నీట్ ’ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన రాం చందర్ రావు లీకేజీ విషయం తెలిసిన వెం టనే ఎన్డీయే ప్రభుత్వం తక్షణమే స్పం దించి 31 మందిని అరెస్ట్ చేసిందని తెలిపారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అ నుకూల వ్యక్తులే ఈ లీకేజీకి కారణమని తేలిందన్నారు.
యుపిఏ పాలనలోనే రికార్డు స్థాయిలో లీకేజీలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ శక్తులు తమ గత చరిత్రను గుర్తు చేసుకోవాలని రాంచంద్రరావు హితవు పలికారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలుపాలించిన రాష్ట్రాల్లో సుమా రు 53 కంటే ఎక్కు వ ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అ య్యాయని వివరించారు. 2005 నుండి 2014 వరకు సి బిఎస్‌ఈ, ఎయిమ్స్, ఆర్‌ఆర్ బీ, ఎస్‌ఎస్సి, బ్యాంకింగ్ వంటి అనేక జాతీయ స్థాయి పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆధారాలు చూపారు. ఆ సమయంలో ఏనాడైనా కాంగ్రెస్ లేదా నాన్-బిజెపి ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రు లు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు.











