ప్రజాధనం ఖర్చులపై అనుమానాలు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ..?

మన తెలంగాణ/పెద్దశంకరంపేట : గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు.. వాటితో చేపట్టే అభివృద్ధి పనులు.. చేసిన ఖర్చులు.. చెల్లింపులు.. అన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసు కొచ్చిన డిజిటల్ వ్యవస్థే గ్రామ స్వరాజ్ పోర్టల్, మేరీ పంచాయత్ యాప్. అయితే వాంకిడి మండలంలోని కొన్ని గ్రామపంచా యతీల్లో నిధులు, పనులు, ఖర్చులకు సం బంధించిన వివరాలు సకాలంలో అప్లోడ్ చేయకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రజాధనం లెక్కలు ఆన్లైన్ లోనే కనిపించకపోతే పారదర్శక పాలన ఎలా సాధ్యమనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవు తున్నాయి.

నిధులు వచ్చాయి.. ఖర్చెంత..?!

కేంద్రం నుంచి ఎంత సమకూరింది..? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది..? ఏ పధకం కింద ఎన్ని నిధులు మంజూర య్యాయి..? ఏ పనికి ఎంత ఖర్చుచేశారు..? ఏ పనులు పూర్తయ్యాయి..? ఏవి పెండింగ్ లో ఉన్నాయి..? పంచాయతీ ఖాతాలో ప్రస్తుతం ఎంత మొత్తం ఉంది..? వంటి వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఆ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడంపై గ్రామస్థులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లెక్కలు లేవు..?!

ప్రజలకు సమాచారం సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్, యాప్లను అందుబాటులోకి తెచ్చింది. కానీ వాటిలోనే వివరాలు కనిపించకపోవడంతో అధికారుల పనితీరుపై ప్రశ్నలు వ్యతిరేకెత్తిస్తోంది. పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత సిబ్బంది నిధులు, పనులు, చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉన్నా. జాప్యం ఎందుక ఎజరుగుతోందనే ప్రశత లెత్తుతోంది.

నిర్లక్ష్యమా.. సాంకేతిక సమస్యా..?

వివరాలు అప్లోడ్ కాకపోవడానికి సాంకెతిక సమస్యలు కారణమా..? అన్నది తెల్లల్సి ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారమే కనిపించకపోవడంతో అంటున్నారు. పంచాయతీల వారీగా తనిఖీలు చేయాలి. పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లో గ్రామ స్వరాజ్ పోర్టల్. మేరీ పంచాయతీ యాప్ లో నిధులు పనులు ఖర్చులు చెలింపులు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా లేదా అనే దాని పై ఉన్నంత్తాధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వివరాలు అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆన్లైన్లో కనిపించని పంచాయతీ నిధుల వివరాలుపంచాయతీ నిధులు ప్రజల సొమ్ము. వాటి వినియోగానికి సంబంధించిన ప్రతి లెక్క ప్రజలకు తెలియాల్సిందే. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎక్కడ ఖర్చయ్యాయి.. ? ఏ పనులకు వినియోగించారు..? అనే వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.. ఇప్పటికైనా జిల్లా, మండల స్థాయి అధికారులు స్పందించి పంచాయతీల వారీగా ఆన్ లైన్ వివరాలను సమీక్షించి, పెండింగ్ సమా చారాన్ని పూర్తిస్థాయిలో అప్లోడ్ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. డిజిటల్ పారదర్శకత వ్యవస్థను అధికారులు నిర్లక్ష్యం చేస్తే దెబ్బతింటుందనివారు పేర్కొన్నారు. ప్రజాధనం ప్రజల హక్కు లెక్కలు ప్రజల ముందే ఉండాలి.