మన తెలంగాణ/హైదరాబాద్: ‘మీరు హుందాగా తప్పుకోండి&ఇది పార్టీ అధిష్టానం ఆదేశం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన నివాసంలో (ప్రజాభవన్) ఆయనతో చర్చించినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ వివాదం అంశాన్ని పార్టీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించగా, ఆయన కొండా మురళిని పిలిపించి చర్చించినట్లు ఈ వర్గాల సమాచారం. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తే, ఈ వివాదం ఇక్కడితో సమిసిపోతుందని, అది హుందగా ఉంటుందని భట్టి విక్రమార్క

నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ కొండా మురళి, ఏది అయితే అదే అవుతుందని మొండికేసినట్టు తెలిసింది. ఈ దశలో మంత్రి పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని, ఇదే చివరి అవకాశం అని చెప్పినట్టు తెలిసింది. అధిష్టానం సీరియస్‌గా ఉన్నదన్న విషయాన్ని గమనించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చుద్దామంటూ కొండా మురళి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీ ముగిసిన అనంతరం కొండా మురళితో జరిగిన చర్చా, అందుకు ఆయన స్పందనను భట్టి విక్రమార్క సీఎం రేవంత్‌రెడ్డికి వివరించినట్లు తెలిసింది.

ఇలా ఉండగా భట్టితో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కొండా సుస్మిత పటేల్ తన ప్లాన్ -ఏ మాత్రమే చెప్పారని, ప్లాన్-బి ఏమిటో తమకు తెలియదని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా కొండా సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరగా, ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. చివరిగా మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కొండా మురళిని పిలిపించి అదే మాట చెప్పినట్లు తెలిసింది. ఇలా ఉండగా, కొండా మురళితో భట్టి సమావేశమైన అదే సమయంలో మరో అసమ్మతినేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం గమనార్హం. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి అక్కడికి వచ్చినట్లు తెలిసింది. అయితే తాను తన నియోజకవర్గానికి చెందిన పెండింగ్ బిల్స్ కోసం మాత్రమే వచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పారు. కొండా సుస్మిత వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఆయన తోసిపుచ్చారు.

ప్రజా భవన్‌లో హైడ్రామా..

ప్రజాభవన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తే, ఈ వివాదం ఇక్కడితో సమిసిపోతుందని, అది హుందగా ఉంటుందని భట్టి విక్రమార్క నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ కొండా మురళి, ఏది అయితే అదే అవుతుందని మొండికేసినట్టు తెలిసింది. ఈ దశలో మంత్రి పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని, ఇదే చివరి అవకాశం అని చెప్పినట్టు తెలిసింది.

అధిష్టానం సీరియస్‌గా ఉన్నదన్న విషయాన్ని గమనించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చుద్దామంటూ కొండా మురళి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తాను మీకు సహాయం చేయలేనని ఖర్గే కరాకండిగా తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరిగింది.


కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు&

తాము పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలమని అన్నారు. పార్టీని వీడే ప్రసక్తి లేదని కొండా మురళి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

సుస్మిత ప్లాన్-బి ఏమిటో?

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ బిల్స్ విషయంమై చర్చించేందుకు వచ్చానన్నారు. తన కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. కొండా సుస్మిత పటేల్ ప్లాన్ -ఏ మాత్రమే చెప్పారని, ప్లాన్-బి ఏమిటో తమకు తెలియదన్నారు. సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, 35 ఏళ్ల వయసున్న ఆమెకంటూ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని, ఆమె ప్రశ్నించే అధికారం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఆమె వరంగల్‌లోనే ఉన్నారని మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారని చెప్పారు. భట్టి విక్రమార్కను తాను కేవలం బిల్లుల కోసం మాత్రమే కలిశానని, అక్కడ కొండా సురేఖ అంశం చర్చకు రాలేదని అన్నారు.

--++--