
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుడాన్ దేశస్థుడిని సైఫాబాద్ పోలీసులు రక్షించారు. టోలిచౌకీ పారామౌంట్ కాలనీలో నివాసముంటున్న సుడాన్ దేశానికి చెందిన నాజర్ ఆడమ్(25) బుధవారం తెల్లవారుజామున హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. అక్కడే విధుల్లో ఉన్న లేక్ పోలీసులు అప్రమత్తమై చెరువులో దూకి ఆడమ్‌ను తాళ్లసాయంతో కాపాడారు. సైఫాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.











