హనుమకొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపినీ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదా జరిగింది. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో దాదాపు 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలుగజేసుకొని ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినవని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈక్రమంలో  మంత్రులకు ఎమ్మెల్యేకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం జరిగినా అసంపూర్తిగా ఉండడంతో అన్ని పనులు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అధికారులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో సభ ప్రశాంతంగా ముగిసింది.