
‘జెన్ జీ’కి మరింత చేరువయ్యేందుకు బీజేపీ కమిటీ
-కమిటీ సభ్యుల్లో నితిన్ నబీన్, స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: యువత, జెన్ జీకి మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యాలంయలో నితిన్ నబిన్ అధ్యక్షతన శనివారంనాడు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక బృందంలో నితిన్ నబీన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన స్మృతి ఇరానీ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు వినోద్ తావ్డే, హర్ష్ సంఘ్వి, ఓపీ చౌదరి, ఇతర బీజేపీ నేతలు కూడా ఈ బృందంలో ఉంటారు. ఈ టీమ్ నేరుగా యువతతో, ముఖ్యంగా జన్ జీని కలిసి వారి అంచనాలు, ఆందోళనలను తెలుసుకుంటుంది. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలను యువతకు చేరువ చేసేందుకు ఈ టీమ్ కృషిచేస్తుంది.











