హనుమకొండ: పాలిటెక్నిక్ విద్యార్థుల పట్లు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. హనుమకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆయనను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్బంగా హరీశ్ మాట్లాడుతూ.. 97 జివొను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాన విద్యార్థుల ఉద్యమాలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జెన్‌జీ ఉద్యమాలపై కాంగ్రెస్‌కు ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి ఏంటని దుయ్యబట్టారు. అంతకు ముందు హనుమకొండలోని కలెక్టరేట్ వద్ద టిఎన్‌జివొలు నిర్వహించిన ధర్నాలో హరీశ్ రావు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు అయన్ను అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.