కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి బిట్టూ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ఆమోదించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో విదేశాల్లో ఉన్నారు.2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న బిట్టూ..

వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన బిట్టూ 2024లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రాజీనామాతో ఖాళీ అయిన రాజస్థాన్ రాజ్యసభ స్థానంలో మిగిలిన పదవీకాలానికి బిట్టూను నామినేట్ చేశారు.