మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ 50వ జన్మదినం పురస్కరించుకుని గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేత, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గురువారం కింగ్ కోఠిలోని ఎల్లెన్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు 50 సైకిళ్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ ముఖ్యఅతిథులు హాజరై విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బిషప్ విద్యాసాగర్, రామ్ కోటి సిఎస్‌ఐ చర్చి సీనియర్ పాస్టర్ల సమక్షంలో కెటిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, బిఆర్‌ఎస్ నేతలు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.