
నిర్మల్: సవతి తల్లి కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకొని అనంతరం అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడిని ఆమె సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... (పేరు మార్చబడింది) సదా బేగం(41) అనే మహిళను, అస్లాంఖాన్ (28) తండ్రి 17 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. అస్లాంఖాన్‌తో సదా బేగం అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. అస్లాంఖాన్ మరో యువతిని పెళ్లి చేసుకుంటానని తన సవతి తల్లికి చెప్పాడు. కానీ ఆమె అతడి పెళ్లికి అడ్డు చెప్పడంతో పాటు తగిన విధంగా ఆర్థిక సాయం చేస్తానని వివాహం చేసుకోవద్దని హెచ్చరించింది.
మరో యువతిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించడంతో ప్రాణ భయంతో అతడు బాబాయ్‌కి జరిగిన విషయం చెప్పాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో తన బాబాయ్ దగ్గరికి మకాం మర్చాడు. తన పరువు పోవడంతో అస్లాం మరో పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై సవతి తల్లి పగ పెంచుకోవడంతో పాటు హత్యకు ప్లాన్ చేసింది. మహారాష్ట్రాకు చెందిన సుపారీ గ్యాంగ్ కు ఆరు లక్షలకు మాట్లాడుకోవడంతో పాటు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. అస్లాం ఫొటోలు, ఆటో నంబరుకు సుపారీ గ్యాంగ్‌కు ఇచ్చింది. అస్లాం ఆటోలో వెళ్తుండగా సుపారీ గ్యాంగ్ కారుతో అడ్డుకొని ఢీకొట్టారు. అనంతరం అతడిని కత్తులతో పొడిచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో సదా బేగంను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెతో పాటు సుపారీ గ్యాంగ్‌లో ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.











