
కైరో : బాబ్ అల్ మాండెట్ జలసంధి లోని నౌకపై హూతీలు మంగళవారం దాడి చేయడంతో నలుగురు నావికులు ప్రాణాలు కోల్పోయారని యెమెన్ తీర రక్షక దళం వెల్లడించింది. మృతుల్లో ముగ్గురు పాకిస్థానీయులు కాగా, మరొకరు ఇండోనేషియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. టాంజానియా జెండా కలిగిన కార్గో నౌక ఒమన్ నుంచి జిబౌటి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై హూతీలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చమురు రవాణాలో మాండెబ్ జలసంధికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరేబియా సముద్రంతో ఎర్ర సముద్రాన్ని అనుసంధానం చేసే ఈ జలసంధి సూయజ్ కాలువ దిశగా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా , పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం.











