ఢిలీ: నీట్-యుజి నిరసన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ ను విత్ డ్రా చేయాలా, మూసివేయాలా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని, క్రిమినల్ యాంటీసిడెంట్స్ అంటే..గతంలో హత్య, దోపిడీ, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల చరిత్ర ఉన్నవారేనని సుప్రీంకోర్టు తెలిపింది. కేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నమోదైన కేసులను నేర ఘటనలుగా ‘క్రిమినల్ యాంటిసిడెంట్స్’ గా పరిగణించరాదని సూచించింది. ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులకు ఉపశమనం కల్పించవచ్చునని  పేర్కొంది. పోలీసులు అతిగా బలప్రయోగం చేసినా, నేరాలకు పాల్పడిన నిరసనకారులైనా చట్టం ముందు జవాబుదారీతనం కావాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.