వరదలతో తీవ్రం గా దెబ్బతిన్న నేపాల్‌కు భార త్ ఆపన్నహస్తం అందింస్తోం ది. గురువారం మరో విడత సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానం ద్వారా పంపించింది. భారీగా మందు లు, ఆహార ప్యాకెట్లు, ఇతర అత్యవసర వస్తువులను తరలించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బుధవారంనాడు పంపిన 10 టన్నుల సామగ్రికి తోడు గురువారంనాడు మరో 37.5 టన్నుల అత్యవసర, సహాయక సామాగ్రి పంపినట్లు ఆయన తెలిపారు. నేపాల్ అధికారులతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలకు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తూనే ఉంటుంది అని జైశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి, విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే తొలి విడత సహాయ సామగ్రిని భారత్ పంపింది.