
ఐపిఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న కీలకమైన 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ( 56: 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు) హాఫ్ సెంచరీతో జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో రెచ్చిపోయి 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. చివర్లో 29 పరుగులతో నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ గా నిలిచాడు.












