హైదరాబాద్: హీరో కిరణ్ అబ్బవం నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టివి’. గత నెలలో విడదలైన ఈ విలేజ్ కామోడీ డ్రామా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 15 నుంచి ఈ సినిమా ప్రముఖ ఒటిటి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ ఆహా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కొత్త నటీనటులను పరిచయం చేస్తూ.. వి.మునిరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు.