
పాకిస్థాన్‌తో స్వదేశంలో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ మూడు వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో అతడికి తొలిసారి విండీస్ జట్టులోకి పిలుపు వచ్చింది.
మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ పాక్‌తో టెస్ట్ సిరీస్‌కి దూరమయ్యాడు. అతడి స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సిరీస్‌కి వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇది వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి. జోసెఫ్ వంటి ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో పాకిస్థాన్ బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని ‘బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ’ మైదానంలో జరుగనుంది. ఈ వేదికపై తొలిసారి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగనుండడం విశేషం.











