విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను ’క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అంటూ ఘా టు పదజాలంతో విమర్శించారు. భారతదేశ విద్యా వ్య వస్థ కుప్పకూలడానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నారు. జూలై 20వ తేదీ నిరసనలపై భద్రతా దళాలు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన సాహిల్ అనే విద్యార్థిని మీడి యా సమావేశంలో రాహుల్ హాజరుపరిచారు. అనంత రం మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన సాహిల్‌కు పెల్లెట్ గాయాలైనట్టు చెప్పారు. సాహిల్ తొడుక్కున్న టీషర్ట్ పైకి జరిపి అతనికి తగిలిన గాయాలను మీడియాకు చూపించారు. సాహిల్ కంటికి గాయమైందని, ఆ కంటి నుంచి అతను చూడలేకపోతున్నాడని చెప్పారు.

ఇదీ మన దేశ భవిష్యత్తు. వేలాది మంది యువత పరిస్థితి ఇది. పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి లాఠీచార్జి చేశారు. వాళ్లు ఏం చేశారు? శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారని రాహుల్ తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం సాహిల్ పరీక్ష రాశాడని, అయితే ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పారు. అతని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో పరీక్ష రాశాడని వివరించారు. ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలు ఆడరాదని అన్నారు. పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, కాల్పులు, లాఠీచార్జిలతో దమనకాండకు పా ల్పడిన వారిపై చర్చలు తీసుకోవాలని, ఈ వ్యవస్థను నడుపుతున్న ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ’దాడులు ఆపండి..మా విద్యార్థులను బెదిరించడం మానండి’ అని రాహల్ అన్నా రు. కాగా, పార్లమెంటు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లు ఉపయోగించారనే ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.