
ఢిల్లీ: పేపర్ లీకేజీ వల్ల నష్టమేపోయేది విద్యార్థులు అని ఎఐసిసి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విద్యార్థుల ఆవేదనను అందరం అర్థం చేసుకోవాలని అన్నారు. రాజ్యసభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాంటీ పేపర్ లీకేజీ విషయంపై ఖర్గే ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, పేపర్ లీక్ కాకుండా ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదని ఖర్గే విమర్శించారు. 2024 లోనే ఈ ప్రభుత్వం బిల్లు ఎందుకు తీసుకురాలేదని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశం అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీ కాపాడారని ఖర్గే మండిపడ్డారు. ఢిల్లీలో నిరసన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జి చేశారని, విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీసుల చర్యలపై ఇంతవరకు హోమంత్రి అమిత్ షా ఎలాంటి ప్రకటన లేదని, పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి కారణం ఎవరో తేలాల్సి ఉందని, ఈ దారుణమైన ఘటనకు అమిత్ షా బాధ్యత వహించాల్సిందేనని, మౌనంగా ఉండటం కాదు.. ఘటనపై నోరు విప్పి మాట్లాడాలని మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.








