
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. నీట్ పేపర్ లీక్, తదనంతర పరిణామాల నేపథ్యంలో మోదీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపరు లీక్‌లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నపత్రాల లీక్‌ల ఘటనలో దోషులకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.10కోట్ల వరకూ జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిం ది. పార్లమెంటులో వచ్చే వారం ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పేపరు లీక్‌లపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో చర్చలు జరిపారు. 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కీలక సవరణలు చే యాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టం కింద ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగతత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా ఉంది. తాజాగా ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెం చుతూ చట్టాన్ని సవరిస్తున్నారు.
రూ .3,030 కోట్లతో 3 కెమికల్ పార్కులు
కాగా, స్వయం సమృద్ధి భారతంలో భాగంలో రూ.3,030 కోట్ల అంచనా వ్యయంతో ‘భవ్య రసాయన్’ పథకానికి కేంద్ర కేబినెట్ శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో మూడు కెమికల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. ఈ పార్కుల ద్వారా రసాయన తయారీ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు మెరుగైన వసతులు కల్పించనున్నా రు. ఈ పథకం కింద పార్కుల్లో రూ .3,000 కో ట్లు సాధారణ వసతులకు, రూ.30 కోట్లు పరిపాలనా వ్యయానికి ఖర్చు చేస్తారు. కేంద్రం ఆర్థిక సాయంగా ఒక్కో పార్కుకు గరిష్టంగా రూ.1,000 కోట్ల గ్రాంటు అందజేస్తుంది. సంబంధింత రాష్ట్రా లు కనీసం రూ.500 కోట్లు కేటాయించాల్సి ఉం టుంది. ప్రతి పార్కు కనీసం 8 చదరపు కిలోమీటర్ల (సుమారు 2,000 ఎకరాలు) భూభాగంలో ఉండాలి. ఈ స్కీమ్ 2026-27 నుంచి 2020-31 వరకూ ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది.
కర్ణాటక, ఆంధ్రలో రూ.1,264 కోట్లతో రైల్ లైన్ విస్తరణ ప్రాజెక్టు
కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే రవాణాను మరింత బలోపేతం చేసేందుకు బళ్లారి-గుంతకల్ మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్ణానికి కేంద్ర కేబినెట్ శుక్రవారంనాడు ఆమో దం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్లు కేటాయించారు. పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టు అమలు కానుంది. రెండు రాష్ట్రాల మధ్య మూడు జిల్లాలను కలుపుతూ సు మారు 46 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అమలుతో 99 గ్రామాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభిస్తుంది. సుమారు 7 లక్షల మందికి ప్రయాణ సౌకర్యాలు మెరుగపడనున్నాయి. ఈ పనులను 2028-29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.











