సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బాధితుడిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాదు, స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని అదనపు డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన అధికారులు ఎస్సై నందితను లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.















