
అమరావతి: ఎంఆర్‌ఒ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో సిద్దంపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పిజిఆర్‌ఎస్ విభాగంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అతడి భార్య అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో ఎంపిడిఒగా విధులు నిర్వహించారు. కూతురు అమెరికాలో చదువుకుంటుండగా కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు.
2024 ఎన్నికల సమయంలో రామాపురంలో ఎంఆర్‌ఒగా విధులు నిర్వహించారు. పిజిఆర్‌ఎస్ అర్జీపై వచ్చి అభియోగాల కారణంగా విఆర్‌ఒ వెంటకరమణను సస్పెండ్ చేయడంతో పాటు శ్రీనివాసులను కలెక్టరేట్‌లోని కెఆర్‌ఆర్ సి విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేయగా శ్రీనివాసులు అవకతవకలు చేసినట్టు అభియోగాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయనకు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతడి భార్య అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు విధుల్లో అభియోగాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. గురువారం సాయంత్రం సిద్దం పల్లెలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరుకు వెళ్తున్న రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.











