న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధానకి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటలపాటు చర్చించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా జితేంద్ర సంగ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యతును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంతో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానక ప్రధాని ఏ మాత్రం ఆలస్యం చేయలేదని వెల్లడించారు.