సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వం అని పేర్కొన్నారు. అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెండ్ల అనుబంధం అజరామరమని అన్నారు. సహోదరత్వానికి ప్రతీకగా నిలిచిన రాఖీ బంధన్ పర్వదినం, భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ, సాంస్కృతిక వేడుకగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ద్వేషము, స్వార్థము వీడి, దేశ ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించడం ద్వారానే వసుదైక కుటుంబ భావన పరిఢవిల్లుతుందని కెసిఆర్ పేర్కొన్నారు.