
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి (ఈనెల 25వ తేదీ)ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇది రైతుల పండుగ అని అభివర్ణిస్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నీ ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.











