
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అన్పి పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కానుంది. స్వర్గ లోకం నుంచి అప్సరసలు భూమి మీదకు వస్తే ఏం జరుగుతుందో అనే అంశాన్ని హాస్యంతో జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు చంద్రమోహన్ చింతాడ. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ నుంచి ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి అల్లరి నరేశ్ డ్యాన్ ఇరగదీశారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిశోర్, నరేశ్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీ ధర్ గౌడ్ తదితరులు నటించారు.











