
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగాకు చెందిన ఓ బాలుడు రోజుల తరబడి నీటిలో ఉంటున్నాడు. అతడి వింత ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 16 సంవత్సరాల ఇక్బాల్ షేక్ గత ఐదేళ్లుగా ఇలా చెరువులో ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. శరీరంలో మంటగా అనిపించడం వల్లే నీటిలో ఉంటున్నానని ఇక్బాల్ చెబుతున్నాడు. బయటకు రాగానే మంట మొదలవుతుందని.. నీటిలోకి వెళ్లగానే ఉపశమనం కలుగుతుందని అంటున్నాడు. రోజుల తరబడి నీటిలో ఉండటంతో అతడు చర్మ వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇక, బలుబు, దగ్గు వెంటాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లే స్తోమత తమకు లేదని ఇక్బాల్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో అతడికి చికిత్స చేయించేందుకు స్థానికులు ముందుకొస్తున్నారు.











