స్పెయిన్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థి గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) అనుమానాస్పదస్థితి లో మృతిచెందారు. వేలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న ఆయన ఆదివారం రాత్రి భవనం పై నుంచి పడి ప్రాణాలు కోల్పో యా రు. ఇది ప్రమాదమా? మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన గీట్ల సుభాషినిరెడ్డి, గుణాకర్‌రెడ్డి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సాయి అఖిల్‌రెడ్డి.

ఈ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ బొల్లారంలో నివాసం ఉంటోంది. సాయి అఖిల్‌రెడ్డి గత ఆరు నెలల క్రితమే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివేందుకు స్పెయిన్‌లోని వేలెన్సియా నగ రానికి వెళ్లాడు. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం గమనార్హం. చేతికి వచ్చిన ఏకైక కుమారుడు విదేశీ గడ్డపై విగతజీవిగా మారాడన్న వార్త వినడం తో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుమారుడి మరణవార్త తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల్‌రెడ్డి మృతితో అటు హైద రాబాద్‌లోని వారి నివాసంలోనూ, ఇటు సొంత గ్రామమైన కూనారంలోనూ తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.