
హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నారు. ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలు నింపాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.











