
లిమా: పెరూలో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా నగర శివారులో విమానం కూలిపోవడంతో 13 మంది పర్యాటకులు మృతి చెందారు. ఏరోడియాన అనే ఎయిర్ లైన్ కంపెనీకి చెందిన సెస్నా కారవాన్ సి208 విమానంలో ఇటలీ, జర్మన్, స్పానిష్‌కు చెందిన 11 మంది పర్యాటకులు పిస్కో విమానాశ్రయం నుంచి నాజ్కో లైన్స్ విహార యాత్రకు బయలు దేరారు. టేకాఫ్ అయిన ఐదు నిమిషాల వ్యవధిలో సోకోస్ ప్రాంతంలో ఎటిసితో సంబంధాలు తెగిపోయాయి. నాజ్కా నగర శివారులో విమానం కూలినట్టు అధికారులు గుర్తించారు. 11 మంది పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది చనిపోయారని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని విమానయాన అధికారులు పేర్కొన్నారు.











