
అహల్యానగర్: ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర లోని అహల్యానగర్ లో రెండు గంటల పాటు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారీ మౌన్ అందోళన్ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్ లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆయన నిరసన మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగించారు. ఆ తర్వాత తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.
అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో విద్యార్థులపై హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచి వేస్తున్నాయని పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పనితీరు మరింత జవాబుదారీతనంతో , సమర్ధంగా మారుతుందన్నారు.











