
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం... విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కోల్ కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జి మీద ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తన పాత సినిమాలకు పూర్తి భిన్నంగా చాలా ట్రిమ్‌గా మారిపోయి ఒక కొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ఇక సాయి పల్లవి తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మైమరపించనుంది. హౌరా బ్రిడ్జిపై జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేశారట.











