22652 వార్తలు



జగిత్యాల: చితి ఆరక ముందే బంగారం కోసం మంటలపై నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... మల్యాలలో ఓ మహిళ చనిపోవడంతో శుక్రవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహానికి చితి పెట్టిన అనంతరం వారు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయిన తరువాత ఇద్దరు మహిళలు మృతదేహం తల భాగంపై నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం బూడిదతో పాటు పుర్రెను ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్నవారు వెంబడించడంతో వారు పారిపోయారు. మహిళలు చనిపోతే వారి మెడలో ఉన్న నల్లపూసల ఆభరణం నుంచి బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటించారు. బంగారం గుండు ధర పది వేలకు పైగా ఉండడంతో దాని కోసమే పుర్రెను ఎత్తుకెళ్లి ఉంటారని బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక అల్లాడిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నైరుతి రుతుపవనాల కదిలికలతో ఏపీ, తెలంగాణలో మేఘావృతమై మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాలు నిలకడగా కొనసాగుతూ, దక్షిణ కోస్తాలో చల్లటి గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల పిడుగుల ప్రమాదంపై అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం ఉదయం భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పులు నమోదు కాలేదు. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,930 వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల […] The post నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన కొడుకు ఉద్యమంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు భయపడ్డానని, కొడుకును పోలీసులు కొట్టినప్పుడు మరింత ఆందోళన చెందానని తెలిపారు. నెల రోజుల ఉద్యమంలో నిద్రలేని రాత్రులు, తిండి కూడా సహించని పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో బతికామని అనితా దీప్కే మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. The post నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత appeared first on Navatelangana.

నార్కట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట కింద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద బొమ్మల దుకాణంలో మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు బూడిదగా మారాయి. రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు వ్యాపించడంతో పలు దస్త్రాలు కాలిపోయాయి. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో దుకాణాలలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.











నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి కారును బయటకు తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగం లేదా సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. The post విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయ గుట్ట కింద ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే భారీగా ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న17 దుకాణాలు, 15 తోపుడు బండ్లను బూడిద చేశాయి. మంటల ధాటికి దుకాణాల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అగ్నికీలలు పక్కనే ఉన్న […] The post చెర్వుగట్టులో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారంనాడు వరుస కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. ఆ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి సూచన మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక అధికారిక ఉత్తర్వులో పేర్కొంది.దీనికిముందు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ భావోద్వేగ లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం, యువత కలలు, ఆకాంక్షల పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. నీట్ పేపర్ లీక్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన మొదటి రోజే సీబీఐ విచారణకు ఆదేశించడం, విజయవంతంగా మళ్లీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. భారత యువశక్తే దేశానికి బ

ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగింది. రెండు మాసాలుగా ఈ దేశ విద్యార్థి యువజనులు చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఆ మేరకు శనివారంనాడు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో పరీక్షా పత్రాల లీకేజీకి, విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, ఏర్పడి ఉన్న గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు. ఇది భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పుణ్యమా అని ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన తొలి విజయం. ఈ పార్టీ దేశంలో రాజకీయాల్ని సరి చేయడానికో, అధికారంలోకి వచ్చి దేశ పరిస్థితులను చక్కదిద్దడానికో ఏర్పడింది కాదు. ఈ దేశంలోని విద్యార్థులు, యువకులు సరైన విద్య అందక, ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న స్థితిలో వారిని అవమానించే విధంగా దేశ ప్రధాన న్యాయమూర్తి వారిని ఉద్దేశించి బొద్దింకలు, పరాన్నజీవులు అని చేసిన వ్యాఖ్యల పర్యవసానంగా ఒక వ్యంగ్య వ్యక్తీకరణగా ఏర్పడింది కాక్రోచ్ జనతా పార్టీ. అది ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఏర్పడిన కొద్ది మాసాల్లోనే ఈ దేశంలో ఇక మాకు తిరుగులేదు అంటూ మూడవసారి అధికారంలోకి వచ్చిన కారణంగా అతి విశ్వాసంలో పడిన

న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంపై 37 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎట్టకేలకు శనివారంనాడు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్ నె రవేరింది. తక్కిన రెండు డిమాండ్లు కూడా నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించడంతో తమ నిరసనలను విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రలు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో సీజేపీ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం చర్చలు ఫలప్రదమైనట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థుల అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించినందున ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు. నిరసనకారు లు జంతర్ మంతర్‌ను వీడి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థ, పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని ఇప్పటికే చెప్పామని, నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ కేసులతో వేధించమని, ఎఫ్‌ఐఆర్ కాపీలు అందజేస్తామని, ఆత్మహత్య చేసుకున్న విద్య

శాసనం, న్యాయం, పాలన... ఈ మూడింటికీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పీఠాలు ఉన్నాయి. వాటిని నడిపించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశానికి వెన్నెముక వంటివారు. కానీ, ఇటీవలి పరిణామాలు, వరుస వివాదాలు, అవినీతి కుంభకోణాలు ఈ వ్యవస్థల ప్రతిష్ఠపై మచ్చ తెస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం సహా అనేక ఘటనలు దేశవ్యాప్తంగా అధికారుల నైతిక దిగజారుడుపై తీవ్ర చర్చకు దారితీశాయి. యూపీఎస్సీ వంటి అత్యున్నత పరీక్షల్లో ఉత్తీర్ణులై, కోట్ల మందికి ఆదర్శంగా నిలవాల్సిన కొందరు అధికారులు దారితప్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాసేవ, నిజాయితీ, నిష్పాక్షికతలను పక్కనబెట్టి అవినీతి, అక్రమ సంపాదన, వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాలు, బ్లాక్మెయిలింగ్లు మరియు అక్రమ మైనింగ్ వంటి క్రిమినల్ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. దేశాన్ని కుదిపేసిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ వివాదాలను గమనిస్తే..గత రెండు దశాబ్దాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలువిచారించిన కొన్ని కీలక కేసులు ఈ విలువల సంక్షోభాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో నాటి డైరెక్టర్ అలోక్ వర్మ , స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్