22778 వార్తలు










అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగరబత్తి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే ఫ్యాక్టరీలో శ్రీలక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లు కూడా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. యజమాని ఘటనా స్థలానికి చేరుకొని కన్నీంటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. ఈ విషయంలో చర్చించేది ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ ప్రభుత్వం కుదరదంటే తదుపరి చర్చలకు కూడా చోటులేదని స్పష్టం చేసింది. సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ Xలో ఈ మేరకు పోస్ట్ చేశారు. దీంతో ఇవాళ ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది. The post ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గం: సీజేపీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వివాదంపై మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనప్పటికీ, ఆయన వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. కనీసం క్షమాపణ కూడా కోరకుండా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని 40 ఎకరాల భూమిలో జులై […] The post హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. appeared first on Navatelangana.

బొద్దింకల పార్టీ ఎట్టకేలకు మోడీ ప్రభుత్వ మొండితనాన్ని ఎండగట్టడంలో విజయం సాధించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం తప్ప, పేపర్ లీక్‌ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. ఇక ధర్మేంద్ర విషయమై నిర్ణయానికి రేపు మధ్యాహ్నం వరకు గడువు కోరింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీలు లభించడంతో పర్యావరణ ఉద్యమ నాయకుడు వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను గురువారం రాత్రి విరమించిన సంగతి తెలిసిందే. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీల నివారణకు పటిష్టమైన ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ పరిణామాల సంగతి ఎలా ఉన్నా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలన్నదే. అలాగే కాంగ్రెస్ తదితర విపక్షాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే పార్లమెంట్‌లో చర్చల్లో పాల్గొంటామని ఘంటాపథంగా వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సిందే

జంతర్‌మంతర్ వద్ద ఆందోళన మొదలుపెట్టిన వెంటనే గాని ప్రభుత్వం త్వరపడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కాని, ప్రధాని మోడీ బృందానికి ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఎవరెస్టు స్థాయికి పెరిగి పోయింది. వరుసగా గెలుస్తున్నారు, అందరినీ చీల్చుతున్నారు, ప్రజలను మతతత్వ నినాదాలతో పంచేంద్రియాలను భ్రమపెడుతున్నారు, విదేశాంగ విజయాలంటూ మైమరపింపజేస్తున్నారు, 2014లో గుజరాత్ మోడల్ అంటూ తప్పుదారి పట్టించగలిగినట్లే, భారత అభివృద్ధితో మొత్తం ప్రపంచానికే కళ్లు చెదిరిపోతున్నాయని హోరెత్తించగలుగుతున్నారు. ఇంకా కావలసిందేమిటి? నీట్ తదితర పరీక్షల విషయంలో జవాబుదారీతో పనేమున్నది? కాక్‌రోచ్‌లను ఎందుకు అణచివేయగూడదు? వారు గాని, దేశ ప్రజలు గాని చేయగలదేమిటి? గత 12 సంవత్సరాలలో ఎన్నెన్ని ఉద్యమాలను విజయవంతంగా అణచివేయలేదు గనుక? కాని, అధికారపక్షం దురదృష్టవశాత్తు ఈసారి పరిస్థితి వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏదీ ఎల్లకాలం ఒకే తీరున ఉండదు కదా?అసలు పరిస్థితులన్నవి తేలికగా లేవు. అది చాలదన్నట్లు పరిపాలన సరిగా సాగదు. అది చాలదన్నట్లు కళ్లముందే తప్పులు వరుసగా జరుగుతున్నా అరికట్టరు. అది చాలదన్నట్లు నిరసన ఆందోళ






అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సంబంధించిన ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. సోషల్ మీడియాలో హోంశాఖ మంత్రి ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురివకావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అనిత అకౌంట్ నుంచి వస్తున్న పోస్టులను నమ్మోద్దని అధికారులు తెలిపారు. అకౌంట్ హ్యాక్ కావడంతో ఇప్పటికే ఆమె ఫిర్యాదు చేశారని అధికారులు వెల్లడించారు. అకౌంట్‌ను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : పురుషుల 4×100-మీటర్ల ఫ్రీస్టైల్ ఈత పోటీల్లో కాంస్యం గెలుచుకున్న దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాద్ లి క్లోస్, కామన్వెల్త్ గేమ్స్‌లో అధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు. 19 పతకాలతో లి క్లోస్, ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ ఆడమ్స్, ఇంగ్లాండ్‌కు చెందిన మిక్ గౌల్ట్‌ల రికార్డులను అధిగమించాడు. 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. 18 ఏళ్లకే 5 పతకాలు సాధించిన లి క్లోస్‌కు ఇవి ఐదో కామన్వెల్త్ గేమ్స్. The post కామన్వెల్త్ గేమ్స్‌లో ఒక్కడికే 19 పతకాలు appeared first on Navatelangana.


తెలంగాణ ఆధ్యాత్మికత, జానపద సంస్కృతి, సామూహిక భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు భక్తిపారవశ్యంతో కళకళలాడుతున్నాయి. మహాకాళి అమ్మవారు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మతల్లి వంటి గ్రామదేవతల ఆరాధనకు అంకితమైన ఈ నెలరోజుల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వైభవంగా నిర్వహించబడతాయి. కృతజ్ఞత, భక్తి, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ పండుగకు రాష్ట్రం నలుమూలలనుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. బోనాల పండుగకు చారిత్రక నేపథ్యం 19వ శతాబ్దం ప్రారంభానికి చెందినది. 1813 ప్రాంతంలో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహాకాళి అమ్మవారిని ప్రార్థించి, మహమ్మారి నివారణ కలిగితే హైదరాబాద్‌కు తిరిగి వెళ్లి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పిస్తామని మొక్కుకుంది. వ్యాధి తగ్గిన అనంతరం వారు సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగమైంది. 2014లో తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికా