22776 వార్తలు



హైదరాబాద్: ప్రతి నీటి చుక్క సంరక్షించుకోవాలి - పర్యావరణాన్ని కాపాడాలనే నినాదం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ తో పాటు మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని ప్రతిజ్ఞా చేయించారు. వర్షపు నీటి సంరక్షణ లో భాగంగా సైఫాబాద్ సైన్స్ కాలేజీ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజక్షన్ పాయింట్ , రెయిన్ వాటర్ ఫిట్స్, హార్వెస్టింగ్ బోర్ వెల్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వాటర్ వర్క్ ఎండీ అశోక్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.



Chennai Love Story Box Office: కిరణ్ అబ్బవరానికి మరో బ్లాక్‌బస్టర్ దొరికేసిందా? 'చెన్నై లవ్ స్టోరీ' తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

హైదరాబాద్: విద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు లేవనెత్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల మహాధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, పరీక్షలు సక్రమంగా జరిపి భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నామని తెలియజేశారు. పేపర్ లీక్ లతో పాటు పరీక్షలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, సిబిఎస్ఇ, నీట్ సహా 150 పరీక్షల వరకు గందరగోళంగా మారాయని కోదండరాం విమర్శించారు. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని, పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం వల్లే ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు ప్రజాస్వామ్య వాదులంతా మద్దతు ఇవ్వాలని, శాంతియుతంగా, చట్టబద్ధంగా విద్యార్థుల ఆందోళన జరుగుతోందని తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని..లాఠీఛార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజ్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు.





హైదరాబాద్: జెన్‌జీపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జనరేషన్ ప్రతి దానికి లాజిక్ అడుగుతోందని, యువకులుగా ఉన్నప్పుడు మాకున్న విధేయత ఈ జరేషన్‌కు లేదన్నారు. విశ్వ మాంగళ్య సభలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వం, జ్ఞాన వ్యవస్థలపై విశ్వాసం ఉంచాలని భగవత్ పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, సామాజిక వ్యవస్థలను బలోపేతం చేయడం సమాజానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. తాము చిన్నగా ఉన్నప్పుడు పెద్దల మాటలను పాటించేవాళ్లమని ఇప్పుడు తరం అలా లేదన్నారు. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, తల్లిదండ్రలు వారికి వివరించాలని, పిల్లలను తిట్టడమో, ఆజ్ఞాపించడమో చేయకుండా వారితో మాట్లాడాలని సూచించారు. దేవుళ్లకు కోతి, ఏనుగు ముఖాలు ఎందుకు ఉన్నాయని పిల్లలు అడుగుతున్నారని, ఎందుకు ఉన్నాయో చాలా మంది తల్లిదండ్రులకు తెలియదని, అందుకే ఇలాంటి జ్ఞానం పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని మోహన్ భగవత్ సలహా ఇచ్చారు. కొత్త తరంతో ఎక్కువ సేపు సలహాలు ఇవ్వాలని, ఆదేశాలు జారీ చేయవద్దని, మనం వారితో కలిసి ఉన్నామని భావన కల్పించాలన్నారు. మాతృత్వం లేకుండా జీవ సృష్టి, పోషణ అసాధ్యమని, మానవ నాగరికత

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న యువతపై ఢిల్లీ పోలీసులు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, 130 మంది పోలీసులు, సుమారు 65 మంది విద్యార్థులు గాయపడ్డారని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. “అటువంటి వ్యక్తులను […] The post జంతర్ మంతర్ ర్యాలీపై15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు appeared first on Navatelangana.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాత్రిపూట వీడియోలు చేస్తున్నారని, విద్యార్థులను కేంద్రం వేధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎంత బెదిరించినా విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి కదలరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీక అని రాహుల్ గాంధీ విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారని తెలియజేశారు. నీట్ లీక్ పై విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని, విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

నవతెలంగాణ – సత్తుపల్లి : భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగును పూర్తిగా నివారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి వర్షాభావం తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ఎల్ నినో ప్రభావం యాసంగి వరకు కొనసాగవచ్చని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్టుల్లోని నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని స్పష్టం చేశారు. […] The post బోరుబావుల కింద వరి సాగు వద్దు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

నవతెలంగాణ – సత్తుపల్లి : ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం ఉన్న పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని, తెలంగాణలో దీని సాగు విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో తాజా గెలలకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రైతులు నర్సరీలకు వచ్చినప్పుడు మొక్కలు […] The post ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

హైదరాబాద్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో దారుణం జరిగింది. తమ్ముడి కుమారుడి దాడిలో పెదనాన్న ప్రాణాలు కోల్పోయాడు. సాంబరెడ్డి అనే వ్యక్తి మానసిక దివ్యాంగుడు. తమ్ముడు కుమారుడు రాజు అనే వ్యక్తి అర్థరాత్రి మద్యం మత్తులో కర్రతో పెదనాన్న సాంబరెడ్డిపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. నాచినపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం పార్టీలో అంతర్గత తగాదాలకు దారితీసింది. స్థానిక ఎంఎల్‌ఎ మందుల సామేల్ వర్సెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెండు వర్గాల కాంగ్రెస్ నేతల కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. తుంగతుర్తి ఇష్యూ పరిశీలికుడిగా జగ్గారెడ్డిని పార్టీ నియమించింది. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన విభేదాలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. తుంగతుర్తి ఎంఎల్‌ఎ మందుల సామేల్, భువనగిరి ఎంపి కిరణ్ కుమార్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యానని తెలిపారు. ఇదంతా తాను చూడని రాజకీయం కాదు అని, ఎవరి కెపాసిటీ ఎంటో తనకు తెలుసునన్నారు. మొదటి ప్రాధాన్యత స్థానిక ఎంఎల్‌ఎకు ఉంటుందని, రెండో ప్రాధాన్యత ఎంపి, మూడో ప్రాధాన్యత డిసిపి ప్రెసిడెంట్‌కు ఉంటుందని తెలియజేశారు. ఒక వర్గానికి సానుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన రిపోర్టుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. ఈ వివాదంపై ఏడు పేజీల నివేదికను సిద్ధం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కేంద్రం వేధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీలు ఆపలేరు కాని, దిల్లీలో మెట్రోలు, రోడ్లను మూసివేస్తారని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థులపై కేంద్రం క్రూరమైన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవస్థలోని లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు కోరుతున్నారని, ఆయన శాఖ మార్చడం కాదన్నారు. విద్యార్థులతో మోదీ వీడియోల ద్వారా ఆటలాడుతున్నారని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. The post అన్నీ మూసేస్తారు.. కానీ లీక్‌ను మాత్రం ఆపలేరు: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సద్గురు మలయాళ స్వామి ఆరాధనోత్సవాల వేళ ఆశ్రమంలో అవినీతి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున పరంపర స్వామీజీలు, దాతలు, భక్తులు ఆశ్రమానికి చేరుకొని ధర్నాకు దిగారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్రమం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఏఈవో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టించడంతో ఏఈవో మౌనికపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి వివరాలోకి వెళితే.. రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన కాట్రోత్ కిషన్ అనే గిరిజన రైతుకు చెందిన ఎకరం రెండు గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రైతు భరోసా నిధులు గత కొన్ని సంవత్సరాలుగా అకౌంట్లో జమ కావడం లేదు. దీంతో జిల్లా […] The post రైతు భరోసా నిధుల గోల్ మాల్.. ఏఈవో సస్పెండ్ appeared first on Navatelangana.

