22760 వార్తలు




ఢిల్లీ: నీట్ విద్యార్థులు జరిపిన ఆందోళనకు స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ తో కేంద్రంపై సిజెపి ఒత్తిడి తెచ్చింది. సిజెపి డిమాండ్లతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. సిజెపిలో చర్చలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో విద్యార్థులు రోడ్డెక్కారు. సిజెపి జంతర్ మంతర్ దగ్గర నెలరోజులుగా నిరసనలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామాకు సిజెపి పట్టుబట్టారు. తదుపరి సిజెపి పోరాటం ఫలించింది.ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజులుగా వరుస ఘటనలు తనను బాధించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి అని కొనియాడారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని, దేశ ఐక్యత కొనసాగాలని, యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ సేవకు తన అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నానని, నీట్ అక్రమాలు వెలుగులోకి ర



హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై ఎంఎల్‌ఎ మందు సామేలు తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఎవరూ టికెట్ ఇప్పించలేదని, తుంగతుర్తి ఎంఎల్‌ఎ టికెట్ తన చేతిలో, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఉండదని, కాంగ్రెస్ అధిష్ఠానం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చారని తెలిపారు. తనను ఎవరూ గెలిపించలేదని, కాంగ్రెస్ పార్టీ గెలిపించిందని తెలియజేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి తప్పు చేశామని తన అభిమానులు అనుకుంటున్నారని, తాను ఎన్నోసార్లు మంత్రిని కలిసినా రోడ్డు ఇవ్వలేదని మందుల సామేల్ ధ్వజమెత్తారు. సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గం ఎలా వస్తారని ప్రశ్నించారు. మంత్రి వచ్చినప్పుడు అటెండర్‌తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడినని, తన నియోజకవర్గం విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినా కూడా వినడం లేదన్నారు. నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తన గురించి హీనంగా మాట్లాడుతున్నారని, వీరేశం, తనని ప్రజలు 50,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాలు బాగోలేవని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, అసులు మునుగోడు సంగతికి చూసుకోవాల




హైదరాబాద్: ప్రతి నీటి చుక్క సంరక్షించుకోవాలి - పర్యావరణాన్ని కాపాడాలనే నినాదం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ తో పాటు మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వర్షపు నీటిని సంరక్షించి జలవనరులు కాపాడుకోవాలని ప్రతిజ్ఞా చేయించారు. వర్షపు నీటి సంరక్షణ లో భాగంగా సైఫాబాద్ సైన్స్ కాలేజీ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజక్షన్ పాయింట్ , రెయిన్ వాటర్ ఫిట్స్, హార్వెస్టింగ్ బోర్ వెల్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వాటర్ వర్క్ ఎండీ అశోక్ రెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు.



Chennai Love Story Box Office: కిరణ్ అబ్బవరానికి మరో బ్లాక్‌బస్టర్ దొరికేసిందా? 'చెన్నై లవ్ స్టోరీ' తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

హైదరాబాద్: విద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు లేవనెత్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల మహాధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, పరీక్షలు సక్రమంగా జరిపి భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నామని తెలియజేశారు. పేపర్ లీక్ లతో పాటు పరీక్షలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, సిబిఎస్ఇ, నీట్ సహా 150 పరీక్షల వరకు గందరగోళంగా మారాయని కోదండరాం విమర్శించారు. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని, పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం వల్లే ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు ప్రజాస్వామ్య వాదులంతా మద్దతు ఇవ్వాలని, శాంతియుతంగా, చట్టబద్ధంగా విద్యార్థుల ఆందోళన జరుగుతోందని తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని..లాఠీఛార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజ్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు.





హైదరాబాద్: జెన్‌జీపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జనరేషన్ ప్రతి దానికి లాజిక్ అడుగుతోందని, యువకులుగా ఉన్నప్పుడు మాకున్న విధేయత ఈ జరేషన్‌కు లేదన్నారు. విశ్వ మాంగళ్య సభలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వం, జ్ఞాన వ్యవస్థలపై విశ్వాసం ఉంచాలని భగవత్ పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, సామాజిక వ్యవస్థలను బలోపేతం చేయడం సమాజానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. తాము చిన్నగా ఉన్నప్పుడు పెద్దల మాటలను పాటించేవాళ్లమని ఇప్పుడు తరం అలా లేదన్నారు. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, తల్లిదండ్రలు వారికి వివరించాలని, పిల్లలను తిట్టడమో, ఆజ్ఞాపించడమో చేయకుండా వారితో మాట్లాడాలని సూచించారు. దేవుళ్లకు కోతి, ఏనుగు ముఖాలు ఎందుకు ఉన్నాయని పిల్లలు అడుగుతున్నారని, ఎందుకు ఉన్నాయో చాలా మంది తల్లిదండ్రులకు తెలియదని, అందుకే ఇలాంటి జ్ఞానం పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని మోహన్ భగవత్ సలహా ఇచ్చారు. కొత్త తరంతో ఎక్కువ సేపు సలహాలు ఇవ్వాలని, ఆదేశాలు జారీ చేయవద్దని, మనం వారితో కలిసి ఉన్నామని భావన కల్పించాలన్నారు. మాతృత్వం లేకుండా జీవ సృష్టి, పోషణ అసాధ్యమని, మానవ నాగరికత

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న యువతపై ఢిల్లీ పోలీసులు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, 130 మంది పోలీసులు, సుమారు 65 మంది విద్యార్థులు గాయపడ్డారని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. “అటువంటి వ్యక్తులను […] The post జంతర్ మంతర్ ర్యాలీపై15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు appeared first on Navatelangana.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాత్రిపూట వీడియోలు చేస్తున్నారని, విద్యార్థులను కేంద్రం వేధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎంత బెదిరించినా విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి కదలరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీక అని రాహుల్ గాంధీ విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారని తెలియజేశారు. నీట్ లీక్ పై విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని, విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

నవతెలంగాణ – సత్తుపల్లి : భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగును పూర్తిగా నివారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి వర్షాభావం తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ఎల్ నినో ప్రభావం యాసంగి వరకు కొనసాగవచ్చని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్టుల్లోని నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని స్పష్టం చేశారు. […] The post బోరుబావుల కింద వరి సాగు వద్దు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.