23137 వార్తలు


జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో యువ ఓటర్ల కత్తు జెన్ జీ ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో జరిగిన చలో సన్సద్ యువత పోరాట సత్తాను అద్దంపట్టాయి. వాళ్లపై ప్రయోగించిన అణచివేత ప్రభుత్వం కూసాలు కదిలేలా చేసింది. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలు జెన్ జీ గురించి ఆలోచించాల్సిన స్థితిని కల్పించింది. ఈ దశలో భారత ప్రజాస్వామ్యం కీలకమైన మలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఆ మార్పును నిర్దేశించే శక్తిగా క్రమంగా జెన్ జీ (Generation Z) తరం ఎదుగుతున్నది. 1995 మధ్యకాలం నుంచి 2010ల ప్రారంభం వరకు జన్మించిన యువతను జెన్ జీగా పరిగణిస్తారు. 2026 నాటికి వీరి వయస్సు సుమారు 14 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. దేశ రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను, ప్రజా విధానాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ఓటరు వర్గంగా ఇప్పుడు ఈ తరం రూపుదిద్దుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 96.88 కోట్లు. వీరిలో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 22.78 శాతం, అంటే దాదాపు 22 కోట్ల మంది. ఇందులో 18-19 సంవత్సరాల మధ్య వయస్సుగల తొలి ఓటర్లు 1.85 కో

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప్ నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ నారా పుట్టినరోజు సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘కపాలి’ అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోహిత్ నారా ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కనిపిస్తున్నారు. కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్లు పోస్టర్‌లో చూపించారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేలా ఆకట్టుకుంటోంది.

అమరావతి: ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో మెగా పేరెంట్స్ మీటింగ్‌కు హాజరైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డలో పంచాయతీ పరిధిలో జరిగింది. జరిగింది. కెవి రమణ అనే వ్యక్తి పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మెగా పేరంట్స్ మీటింగ్ ఉండడంతో విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. మద్యం మత్తులో ఊగుతూ మీటింగ్‌కు హాజరయ్యాడు. బెంచీపై పడిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో పిల్లలకు ఎలా చదువు చెబుతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, విధ్యాశాఖ అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్‌జీ విద్యార్థులు నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ ఆందోళనల్లో నటుడు ఆదిత్య ఓం పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. The post నీట్ అక్రమాలపై జెన్‌జీ ఆందోళన.. appeared first on Navatelangana.







యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ ’నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ’కొంచెం కొంచెం’ను లాంచ్ చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ’కొంచెం కొంచెం’ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ “త్రినాథరావు ‘నేను లోకల్’, ‘ధమాకా’లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్ అందించారు. ఈ సినిమా కూడా అలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం ఆకట్టుకున్నాయి”అని తెలియజేశారు. కేఎల్ నారాయణ మాట్లాడుతూ హవీష్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. హీరో హవీష్ మాట్లాడుతూ “త్రినాథరావు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు. నా వరకు యాక్టింగ్‌లో అన్నింటికంటే కష్టమైనది రొమాన్స్





నిర్మల్: సవతి తల్లి కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకొని అనంతరం అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడిని ఆమె సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... (పేరు మార్చబడింది) సదా బేగం(41) అనే మహిళను, అస్లాంఖాన్ (28) తండ్రి 17 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. అస్లాంఖాన్‌తో సదా బేగం అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. అస్లాంఖాన్ మరో యువతిని పెళ్లి చేసుకుంటానని తన సవతి తల్లికి చెప్పాడు. కానీ ఆమె అతడి పెళ్లికి అడ్డు చెప్పడంతో పాటు తగిన విధంగా ఆర్థిక సాయం చేస్తానని వివాహం చేసుకోవద్దని హెచ్చరించింది. మరో యువతిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించడంతో ప్రాణ భయంతో అతడు బాబాయ్‌కి జరిగిన విషయం చెప్పాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో తన బాబాయ్ దగ్గరికి మకాం మర్చాడు. తన పరువు పోవడంతో అస్లాం మరో పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై సవతి తల్లి పగ పెంచుకోవడంతో పాటు హత్యకు ప్లాన్ చేసింది. మహారాష్ట్రాకు చెందిన సుపారీ గ్యాంగ్ కు ఆరు లక్షలకు మాట్లాడుకోవడంతో పాటు రూ.50 వేలు అడ్వాన్






కామన్వెల్త్ గేమ్స్ షురూ గ్లాస్గో: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం లో ఆరంభోత్సవ వేడుకలు కనుల పండవగా జరిగాయి. పోటీలను బ్రిటన్ రాజు కింగ్ చార్లె స్ 111 అధికారికంగా ప్రారంభించారు. గ్లాస్గోలోని ఓవో హైడ్రోలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కట్టి పడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్‌షో, సాంస్కృతిక, సాహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ స్లైక్టిస్ట్ క్రిస్ హోయ్‌తో పాటు డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్‌తో పాటు రాణి కామిలా ప్రవేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటి టన్‌స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు కాల్లమ్ బిటి, నీనా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేశారు. ఈ పోటీల్లో భారత్‌తో సహా 74 దేశాలు పోటీ పడుతున్నాయి. దాదాపు 3వేల మంది అథ్లెట్‌లు ఇండోర్ పరేడ్‌లో ఆఫ్ నేషన్స్‌లో పాల్గొన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్ర మం పూర్తిగా ఓ భవనం లోపల జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆరంభోత్స వేడుకల్లో పాల్గొన్న భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబయి చ