24477 వార్తలు









లార్డ్స్: మూడో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్‌పై ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో మూడో వన్డేలో విజయం సాధించింది. రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటి చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ 388 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 138, శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురికావడంతో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శ్యామ్ కరన్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జాకోబ్ బెతెల్ తలో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వికెట్ తీసి 91 పరుగులు చేసిన జాకబ్ బెతెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 249 పరుగులు చేసిన జోయ్ రూట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.

డెహ్రాడూన్: చిరుత పులి ఇంట్లోకి తండ్రిపై దాడి చేస్తుండగా అతడిని కూతురు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిమల్టా గ్రామంలో సురేశ్ చంద్ర పాండే(64) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి కిరణ్ పాండే(35) అనే కూతురు ఉంది. సురేశ్ భోజనం చేసి టివి చూస్తుండగా అతడిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. వెంటనే కిరణ్ పాండే గట్టిగా కేకలు వేయడంతో పాటు తండ్రి ఇంట్లో నుంచి బయటకు లాగి డోర్ మూసింది. వెంటనే తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. చాకచక్యంతో చిరుతను ఇంట్లో బంధించిన కిరణ్ పాండేను పోలీసులు, గ్రామస్థులు, అటవీ సిబ్బంది ప్రశంసించారు.











నవతెలంగాణ – హైదరాబాద్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో మెస్సీ జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. చివరి మ్యాచ్‌లో ట్రోఫీతో ముగించాలని ఆశించినా అది నెరవేరకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినా, అభిమానుల విజ్ఞప్తితో తిరిగి వచ్చి 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లు, 2022 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించాడు. అనేక చారిత్రక విజయాలతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో […] The post ఫుట్‌బాల్ కు వీడ్కోలు పలికిన మెస్సీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించినా విజయం దక్కలేదు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం […] The post రో.కో పోరాటం వృధా.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. స్పెయిన్ విజయం సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్, స్పెయిన్ ఆటగాడు గావిపై దాడికి దిగాడు. అతడిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించగా, అడ్డుకునేందుకు వచ్చిన మరో ఆటగాడిపై కూడా దాడి చేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రిఫరీ పరేడెస్‌కు రెడ్‌కార్డ్ […] The post ఫిఫా ఫైనల్‌లో ఘర్షణ appeared first on Navatelangana.