24687 వార్తలు









ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటి ధరపై 50 శాతం వరకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ సబ్సిడీ ఎవరికీ వర్తిస్తుంది?: ఈ పథకం సాధారణ ప్రజల కోసం కాదు. కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన బైక్ టాక్సీ పైలట్లు, ఆటోరిక్షా ఆపరేటర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు డ్రైవర్ల నిర్వహణ ఖర్చులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. 70 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: సబ్సిడీతో పాటు రాష్ట్రంలో ఈవీ వినియోగం సులభతరం చేసేందుకు ప్రభుత్వం సుమారు 70 కొత్త EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులు ఛార్జింగ్ సమస్య లేకుండా సుదూర ప్రయాణాలు కూడా సులభంగా చేయగలుగుతారు. ఈ కొత్త విధానం ఎందుకు?: కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్-డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించడం గోవా ప్ర


హైదరాబాద్: మెహదీపట్నంలో విజయనగర్ కాలనీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం తప్పింది. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తులోని బెడ్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.



స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈ ఏడాది భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో EX90ను విడుదల చేయనుంది. 2026 ఆగష్టు 19న ఇండియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో కంపెనీ నుంచి రానున్న రెండో ఎలక్ట్రిక్ వాహనం. అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన బ్యాటరీ ఎంపికలు, అత్యున్నత భద్రతా ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లు వోల్వో EX90ను 800V ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. ఇందులో 92kWh, 106kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. 1. 92kWh బ్యాటరీ వేరియంట్‌లో రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోటార్ ఉంటుంది. ఇది 333 హెచ్‌పీ పవర్, 480Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం 565 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. 2. 106kWh బ్యాటరీ వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ AWD సెటప్ ఉంటుంది. దీని బేస్ మోడల్ 456 హెచ్‌పీ పవర్, 670Nm టార్క్ అందిస్తుంది. టాప్ పెర్ఫా

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన K సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. కంపెనీ దీనిని ఒప్పో K15 పేరిట చైనాలో జూలై 24న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో విడుదలైన ఒప్పో K15 ప్రో, ఒప్పో K15 ప్రో ప్లస్ మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ధర ఎంత ఉండవచ్చు?ఒప్పో K15 ధరకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ జూలై 24న జరిగే లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రే, వైట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫీచర్లు( అంచనా) డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. అలాగే IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ప్రాసెసర్: పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్‌తో పాటు టైడల్ ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ల

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు, స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. జులై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన నివేదికల ప్రకారం, జులై 19 నుంచి 23 వరకు […] The post జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల నుంచి ఆయన ఈ దీక్షను కొనసాగిస్తుండగా.. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు […] The post సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. appeared first on Navatelangana.





అల్లం అందరి వంటింట్లో ఎప్పుడూ ఉండే సహజ ఔషధం. రుచి కోసం దీనిని అన్ని వంటకాలలో వాడుతుంటారు. అల్లంలో ఉండే జింజరాల్ అనే సమ్మేళనం శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా, ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిపాటి అల్లం రసం తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటంతో పాటు వికారం, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఉదయాన్నే రెండు స్పూన్ల అల్లం రసం తాగితే ఏం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గేందుకు తోడ్పడుతుంది. 2. వికారం తగ్గిస్తుంది: ప్రయాణ సమయంలో వచ్చే వికారం లేదా ఉదయం వికారం వంటి సమస్యల్లో ఉపశమనం కలిగించవచ్చు. 3. బరువు నియంత్రణకు సహకారం: జీవక్రియ (మెటాబాలిజం)ను ప్రోత్సహించి బరువు నియంత్రణలో కొంతమేర ఉపయోగపడవచ్చు. 4. రక్త ప్రసరణకు మేలు: శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే అవకాశం ఉంది. 5. రోగనిరోధక శక్తి: యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర రక్షణ వ్యవస్థకు మద్దతునిస్తాయి. 6. చర్మ ఆరోగ్యం:
