
5264 articles


నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది దుండగులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి వారు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా.. వారు పరారయ్యారు. రైళ్లలో దోపిడీల నియంత్రణకు గస్తీ నిర్వహిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. The post గుంటూరు జిల్లాలో కాల్పులు… appeared first on Navatelangana.

ఊర్కొండ కాంగ్రెస్ నాయకుల ధ్వజంభూకబ్జాలకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాగా మారారువిజయ డైరీ అక్రమాలను బయటపెడతాం.. జాగ్రత్త బిడ్డ!కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ పాషాసర్పంచుల సంఘం అధ్యక్షుడు జరుపులావత్ రమేష్ నాయక్మన తెలంగాణ/ఊర్కొండ: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ఊర్కొండ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బురదలో రాయి వేస్తే అది మీ మీదనే పడుతుంది.. ఎమ్మెల్యేని విమర్శించే ముందు మీ గతాన్ని, మీ స్థాయిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి" అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి. ఆయూబ్ పాషా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జె రమేష్ నాయక్ మండిపడ్డారు.సోమవారం ఊర్కొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బిఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూకబ్జాల పర్వం - బీఆర్ఎస్ ఘనకార్యంగత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి మండలం భూకబ్జాలకు నిలయంగా మారిందని వారు ఆరోపించారు. వందల ఎకరాల ప్రభుత్వ, పేదల భూములను బిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా కబ్జా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని అక్కడక్కడా మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. The post నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. సోమవారం విడుదలైన ఈ ట్రైలర్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఓ ముఖ్యమైన సందేహానికి తెరపడింది. గత రెండు భాగాల్లా కాకుండా, ఈసారి వెంకటేష్‌తో రీమేక్ ఉండదని, మలయాళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారని స్పష్టమైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో […] The post దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : న్యూఢిల్లీలోని కల్ కాజీలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాజీలోని సుమిత్ అకాడమీలో ఓ విద్యార్థినిపై టీచర్ సుమిత్ సెహగల్ అతి దారుణంగా దాడి చేశాడు. కర్రతో కొడుతూ, కాలితో తన్నుతూ, జుట్టు పట్టుకొని ఈడ్చిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. The post విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (శికా)లో ప్రతిష్టాత్మకమైన జైలు మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. మే 11న ప్రారంభమైన ఈ మ్యూజియం, భారతదేశంలో ఐదవదిగా రికార్డు సృష్టించింది. గతంలో సంగారెడ్డిలో ఉన్న మ్యూజియం కుప్పకూలడంతో, ఈ నూతన ప్రాజెక్టును చేపట్టింది. ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమం ద్వారా పౌరులు జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. The post తెలంగాణలో ఐదవ జైలు మ్యూజియం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్- 2026లో ఇవాళ కీలక పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, గుజరాత్, ఆర్సీబీ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతోంది. ఇవాళ తలపడనున్న రెండు జట్ల బ్యాటర్లు అద్భుత ఫామ్‌లో ఉండటంతో నరేంద్ర […] The post IPL-2026: నేడు గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్.. appeared first on Navatelangana.

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అస్తిత్వం చుట్టూ తిరుగుతోంది. డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు ఈ పునాదులపైనే పటిష్టమైన ఓటు బ్యాంకును నిర్మించుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వంటి కొత్తశక్తులు ఈ వ్యవస్థను సవాలు చేయడం ఒక చారిత్రక పరిణామంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఒక సినీ నటుడి రాజకీయ ప్రవేశంగా చూడటం కంటే, మారుతున్న తమిళ సమాజ ఆకాంక్షలకు ప్రతిబింబంగా అర్థం చేసుకోవాలి. ద్రవిడ పార్టీలు దశాబ్దాలుగా సామాజిక న్యాయాన్ని తమ ప్రధాన ఎజెండాగా మార్చుకున్నాయి. రిజర్వేషన్లు, అణగారిన వర్గాల సాధికారత, హిందీ వ్యతిరేక ఉద్యమాలద్వారా అవి ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. కానీ, ఏ పార్టీ అయినా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతుంది. అవినీతి ఆరోపణలు, వారసత్వ రాజకీయాలు, క్షేత్రస్థాయిలో కేడర్ పెత్తనం వంటి అంశాలు సామాన్యులలో అసహనాన్ని కలిగించవచ్చు. విజయ్ తన టివికె పార్టీ ద్వారా ఈ అసంతృప్తినే పెట్టుబడిగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన తన సిద్ధాంతాల్లో ద్రవిడ వాదాన్ని, జాతీయవాదాన్ని మేళవించి ఒక కొత

కష్టాల కన్నీళ్లను వేటితో కొలుస్తారో తెలియదు కానీ కొలమానముంటే అందరికంటే ఎక్కువ కష్టాల కన్నీళ్లు అమెరికా లోని భారతీయులకే. భారతీయుల అమెరికా ప్రయాణాన్ని పరిశీలించినట్లయితే, 1635లో మన దేశం నుండి జేమ్స్ టౌన్, వర్జినియా, అమెరికాకు మొదట వలసపోయిన వ్యక్తి ‘టామ్’ (హెడ్ రైట్) అని నమోదు చేయబడింది. 1680లో భారత సంతతి వ్యక్తి పీటర్, ఐరిష్ మహిళలకు జన్మించిన మేరీ ఫిషర్ స్థిరనివాసం పొందినట్లు తెలుస్తుంది. మన దేశస్థులు ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి రహిత సమాజం, మెరుగైన జీవన ప్రమాణాలు, అధిక జీతాలు, ఉన్నత విద్య, టెక్నాలజీ, పరిశోధనలకు సంబంధించిన ఉన్నతమైన ప్రమాణాలు ఉన్న అమెరికా సంస్థలలో పని చేయడానికి వలస వెళుతున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, భారత్‌లో ఉన్న విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఉన్న అధిక పోటీ నుండి తప్పించుకొని, ఉత్తమ నైపుణ్యం కలిగిన ఐటి, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులు విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు హెచ్1బి వీసాలు ఉపయోగించుకొంటున్నారు. కష్టనష్టాలను భరించి అమెరికా వెళ్లి అక్కడి స్థానికులచే అవమానానికి గురైనప్పటికీ కష్టపడి పనిచేస్తూ సముచిత స్థానాన్

ఇటీవల పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు సంచలనమైన ఫలితాలు అందించాయి. దేశంలో పశ్చిమంనుండి తూర్పువరకు బిజెపి తన పట్టును నిలబెట్టుకునే అవకాశం కలిగి దేశ రాజకీయ చిత్రాన్ని మార్చివేశాయి. అయితే పాలనలో ఉన్న ప్రభుత్వాలు కుప్పకూలిపోవడానికి ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత పథకాలు ఎంతవరకు అభివృద్ధికి దోహదం చేస్తాయో చర్చలోకి రావడం లేదు. ఈ అంశం కొత్త ప్రభుత్వాల ముందు సవాలుగా నిలిచింది. పశ్చిమబెంగాల్‌ను తీసుకుంటే పశ్చిమబెంగాల్ తలసరి ఆదాయంలో మిగతా రాష్ట్రాల కన్నా చాలా తక్కువ స్థానంలో ఉంది. ఈ విషయంలో హర్యానా 3వ స్థానం, గుజరాత్ 5వ స్థానంలో ఉండగా, బెంగాల్ 16వ స్థానంలో ఉండడం గమనార్హం. ఆ రాష్ట్రాల స్థాయికి ఇప్పుడు బిజెపి సారథ్యంలో బెంగాల్ ఎదగడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. ఎన్నికల్లో ప్రకటించిన ఉచిత పథకాల వల్ల నిజమైన అభివృద్ధి లభిస్తుందా? తృణమూల్ కాంగ్రెస్ జనరల్ కేటగిరి మహిళలకు నెలకు రూ. 1500, రిజర్వుడు కులాల మహిళలకు నెలకు రూ. 1700 వంతున ఉచితంగా నగదు పంపిణీ చేసేది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా మహిళలందరికీ

మన తెలంగాణ/హైదరాబాద్: “దేశంలో లోగడ రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బిజెపి రాను న్న రోజుల్లో తిరిగి అక్కడికే చేరుకుంటుంది..’ అ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ‘అబ్ కీ బార్ తెలంగాణ & వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో బిజెపి అధికారంలోకి వస్తుంది.. అంటూ ప్ర ధాని నరేంద్ర మోదీ విశ్వాసం చేస్తూ చేసిన వ్యా ఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తీవ్రం గా ప్రతిస్పందించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇ తర కులాల వారు, మావోయిస్టులు, దేశ ప్రజలు కారా? అని ఆయన ప్రశ్నించారు. వారికీ సమాన హక్కులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను అడిగిన అంశాలన్నింటికీ ప్రధాని మోడీ అంగీకరించారని ఆయన చెప్పా రు. కేంద్ర ప్రభుత్వాన్ని తాము పరిగణలోకి తీసుకోక తప్పదన్నారు. గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని ఆయన చెప్పారు. మెదక్ సభలో కెసిఆర్ మాట్లాడుతూ తమకు ఏమీ వద్దు మీ ప్రేమ ఉంటే చాలని ప్రధాని మోడీని ఉద్ధేశించి అన్నారని ఆ యన గుర్తు చేశారు. తాము అలా అనడం లేదని, నిధులు అడిగామని ఆయన చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డులో యాభై శాతం నిధులు క

మన తెలంగాణ/హైదరాబాద్: -తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివా దం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 (45.72 మీటర్ల ఎత్తు) పనులను ఎపి ప్రభుత్వం చేపట్టడం పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫేజ్-2 పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి ని ర్మాణ పనులు చేపట్టవద్దని ఆ లేఖలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రాచలం సహా ప్ర భావిత ప్రాంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిం ది. 36 వాగుల డ్రైనేజ్ ప్రభావంపై అధ్యయనం చే యాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అ నుమతి లేకుండా ఎపి పనులు చేస్తోందని ఈ లేఖ లో ఆరోపించింది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలని తెలంగాణ కోరింది. ఎపి పనులను ని యంత్రించాలని పిపిఏకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అనుమతులు లేకుండా ముంపు సర్వే పూ ర్తి చేయకుండా ఈ పనులు చేపట్టడం అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రా

పశ్చిమ బెంగాల్‌లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పతనం అనేది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ఓటమి లేదా మరో జాతీయ పార్టీ విజయం మాత్రమే కాదు. ఇది బెంగాల్ రాజకీయ సంసృ్కతిలో చాలా కాలంగా జరుగుతున్న లోతైన మార్పుకు ముగింపు ఘట్టంగా భావించవచ్చు. ఒకప్పుడు వర్గ చైతన్యంపై ఆధారపడిన సిద్ధాంతపరమైన సామూహిక రాజకీయాలు నడిచిన బెంగాల్‌లో, ఇప్పుడు వ్యక్తి ఆధారిత, ధ్రువీకరణకు లోనైన రాజకీయ పోటీ పెరిగింది. ఈ మార్పులో గుర్తింపు రాజకీయాలు, సంస్థాగత శక్తి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కేవలం ఎన్నికల ఫలితంగా మాత్రమే చూడలేం. ఒకప్పుడు బలంగా ఉన్న వామపక్ష రాజకీయ సంసృ్కతి ఎలా క్రమంగా బలహీనపడింది, లోపలినుంచి ఖాళీ అయింది, చివరకు దాని స్థానాన్ని కఠిన జాతీయవాద రాజకీయాలు ఎలా ఆక్రమించాయన్న దానికి ఇది ఉదాహరణగా నిలిచింది. దశాబ్దాల పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు పశ్చిమ బెంగాల్ భిన్నంగా నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి పాలనలో బెంగాల్ ట్రేడ్ యూనియన్ రాజకీయాలు, లౌకికవాదం, మేధో చర్చలు, రైతాంగ ఉద్యమాలు, మతపరమైన రాజకీయాలపై అను

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ డిజిపి సివి ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సి ఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మ హిళా ఐపిఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డిజిపి నిర్ణయించారు. కూకట్‌ప ల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృం దం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. బాధితురా లు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోప ణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లో పాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని ప్రారంభించింది. పోలీసులు బాలిక స్టేట్మెంట్ ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డ్ చే శారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా సిసిటివి ఫుటేజీలు, కాల్ డేటా, డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏ డాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చే పట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కు ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి తొలివిడత అ డ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. విద్యార్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ - ఎయిడెడ్, కో -ఆపరేటివ్, టిజి రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, కెజిబివి, టిజి మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభించాలని వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభించాలని బోర్డు ఆదేశించింది. జూన్ 30లోగా మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. టెన్త్ ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలని, అయితే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌లు సమర్పించిన తర్వాత అడ్మిషన్లు ఖరారు చేయాలని తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలలో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీక
ప్రధాని ప్రసంగంపై మంత్రి పొన్నం విమర్శనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మంచి పరిపాలన అందించటమంటే ప్రజలపై భారాలు మోపడమేనా? అని ప్రధాని మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానొస్తే ఎంతో లాభం జరుగుతుందని ప్రజలంతా భావించారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ కు పోయిగౌరవ ప్రదంగా స్వాగతం పలికామని గుర్తు చేశారు. అభివద్ధి కార్యక్రమాల్లో సీఎం కూడా పాల్గొన్నారని తెలిపారు. కానీ..పీఎం మాత్రం […] The post మంచి పరిపాలన అంటే ప్రజలపై భారాలు మోపడమా? appeared first on Navatelangana.
– డిసెంబర్ 9 నుంచి అందుబాటులోకివచ్చేలా చర్యలు: మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు కొహెడ సమగ్ర మార్కెట్‌కు సంబంధించిన సవరించిన లేఅవుట్‌పై మార్కెటింగ్ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. […] The post తుది దశకు కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ appeared first on Navatelangana.
– చిలకలగూడ హత్య కేసును ఛేదించిన పోలీసులు– ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తినవతెలంగాణ- అంబర్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీప్రేమ వ్యవహారం నేపథ్యంలో హైదరాబాద్ చిలకలగూడలో బీటెక్ విద్యార్థిపై పక్కా ప్రణాళికతో కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో మైనర్ సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలు వెల్లడించారు.చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో […] The post యవన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్ appeared first on Navatelangana.
– లేకుంటే ఈ నెల 25న ధర్నాలు చేస్తాం– మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టీవీవీపీ కమిషనర్‌కు సీఐటీయూ వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్ రద్దు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న ధర్నాలు చేయనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లారయూస్ యూనియన్ ప్రకటించింది. దానికి సంబంధించిన ధర్నా నోటీస్‌ను సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు, టీవీవీపీ కమిషనర్‌కు తెలంగాణ […] The post ప్రభుత్వాస్పత్రుల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్దమని ప్రముఖ సీనియర్ అంబేద్కర్ వాదులు డాక్టర్ జె బి రాజు, డాక్టర్ పికట్ల భరత్ భూషణ్ లు అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన ‘దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచేలా ప్రధాని మోడీ ప్రసంగం : సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం నిరుత్సాహపరిచందనీ, ఆయన ప్రసంగంలో అధికార దాహం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి లోపించిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు […] The post అధికార దాహం తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టేది? appeared first on Navatelangana.