బాలీవుడ్‌లో అందం, ఆత్మవిశ్వాసం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన సుష్మితా సేన్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకుండా, వివాహం కాకుండానే 24 ఏళ్ల వయసులో తల్లిగా మారి సంచలనం సృష్టించింది. ఆ నిర్ణయం తన సినీ కెరీర్‌ను ముగిస్తుందని హెచ్చరించిన వారందరికీ తన విజయాలతో సమాధానం చెప్పింది. తల్లితనాన్ని, స్టార్‌డమ్‌ను ఒకేసారి విజయవంతంగా నడిపించిన సుష్మితా కథ నిజంగా అసాధారణం.
వివాహం కాకుండానే 24 ఏళ్ల వయసులో ఒక చిన్నారిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ నటి Sushmita Sen. 2000లో రెనీ సేన్‌ను దత్తత తీసుకున్న ఆమె నిర్ణయాన్ని అప్పట్లో ఆమె మేనేజర్ తీవ్రంగా వ్యతిరేకించారు. "ఇలా చేస్తే నీ సినీ కెరీర్ పూర్తిగా నాశనమవుతుంది" అని హెచ్చరించినా, సుష్మితా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆశ్చర్యకరంగా, ఆ తర్వాతే ఆమె వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2010లో అలిస్సా అనే మరో చిన్నారిని కూడా దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన సుష్మితా, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.













