టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ, స్నేహితులు, స్టార్ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులుగా తరుణ్, మంచు మనోజ్, శివ బాలాజీ ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా తరుణ్ గురించి మాట్లాడిన రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“తరుణ్‌లో ఇప్పటికీ హీరో మెరుపు ఉంది. సరైన కథలు, బలమైన హీరోయిజం ఉన్న పాత్రలు ఎంచుకుంటే ఆయన మళ్లీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయగలడు” అని రాజీవ్ అన్నారు. మంచి కంటెంట్‌తో రీఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే తన తండ్రి, దిగ్గజ నటుడు-దర్శకుడు దేవదాస్ కనకాల సినీ ప్రయాణం గురించి కూడా గుర్తుచేసుకున్నారు. సినీ రంగంలో మారుతున్న ట్రెండ్‌లను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజీవ్ కనకాల అభిప్రాయపడ్డారు.