ధురంధర్ సినిమా టీమ్‌కు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రొడక్షన్ డిజైనర్ సైనీ ఎస్ జోహ్రాయ్‌పై చండీగఢ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం.
ఫిర్యాదు ప్రకారం.. జోహ్రాయ్ ఆమెను చండీగఢ్‌లోని తాజ్ హోటల్ గదికి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, శారీరకంగా దాడి చేసి గదిలో బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.
ఆ యువతి గతంలో ధురంధర్ చిత్రానికి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.














