బాలీవుడ్ నటి మోని రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని వారాలుగా వారి సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇద్దరూ సోషల్ మీడియాలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

తమ వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా అనవసరంగా జోక్యం చేసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని ప్రశాంతంగా, వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని తెలిపారు.

తమ సంబంధంపై తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.