కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు తారక్ ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో ప్రశాంత్ నీల్ ఫొటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్ అవరే” అంటూ కన్నడ టచ్‌తో విష్ చేశారు.
అలాగే ‘డ్రాగన్’ సినిమా ప్రయాణం కోసం, రాబోయే విధ్వంసం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. తారక్ ‘అవరే’ అనే కన్నడ పదాన్ని ఉపయోగించడంపై టాలీవుడ్, శాండల్‌వుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














