బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై ఆమె ధరించిన లుక్ ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లుక్ మొత్తం విలువ సుమారు 155.87 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.1491 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా డేగ స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేక హెడ్‌గేర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శక్తి, ఆధిపత్యానికి ప్రతీకగా డిజైన్ చేసిన ఈ కిరీటాన్ని తయారు చేయడానికి ఎనిమిది నెలలు పట్టిందట. క్రిస్టల్ అలంకరణలు, విలాసవంతమైన క్లచ్‌లు ఈ లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చాయి. గత ఏడాది కేన్స్‌లో సొంతంగా నెలకొల్పిన రికార్డునే ఈసారి ఊర్వశి తిరగరాసింది. దీంతో ఆమె మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా వార్తల్లో నిలిచింది.